సీఎంను విమర్శిస్తే తాట తీస్తాం.. మోత్కుపల్లికి కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రి మోత్కుపల్లి సీఎం రేవంత్ ను విమర్శించడం తగదని రాజీవ్ గాంధీ పంచాయితీ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ పేర్కొన్నారు.

Update: 2024-06-08 15:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి మోత్కుపల్లి సీఎం రేవంత్ ను విమర్శించడం తగదని రాజీవ్ గాంధీ పంచాయితీ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు మోత్కుపల్లి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. డిసెంబరు 7 కంటే ముందు మోత్కుపల్లి గాంధీభవన్‌కు వచ్చారా..? అంటూ ప్రశ్నించారు. లక్షల మంది కార్యకర్తలు పార్టీ జెండాను మోసి పార్టీని పవర్‌లోకి తీసుకురాగానే ఇప్పుడు పదవుల కోసం పార్టీ పెద్దలపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. సీఎంను విమర్శిస్తే తాట తీస్తామన్నారు.

మోత్కుపల్లి తన పదవుల కోసం తిరగని పార్టీ, కప్పని జెండా లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే కేవలం పదవుల కోసమే అనే దోరణిలో మోత్కుపల్లి ఉన్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికి, ప్రజా పరిపాలన కొనసాగుతుందని సిద్ధేశ్వర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేసే ప్రక్రియ పూనుకుంటే చర్యలు తప్పవన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద మోత్కుపల్లిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. మోత్కుపల్లి లాంటి అవకాశ వాదులు పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి చెక్ పెట్టాల్సిన బాధ్యత పార్టీ ఉన్నదని సిద్ధేశ్వర్ గుర్తు చేశారు.


Similar News