MLC Kavita : పూలేకు ఎమ్మెల్సీ కవిత నివాళులు
MLC Kavita Tributes to Poole
దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతి రావు పూలే సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త అని కవిత స్మరించుకున్నారు. మహిళా విద్యను ప్రోత్సహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించాడని.. మహాత్మ జ్యోతి రావు పూలే బాటలో మనమంతా ముందుకు సాగాలన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
కవిత కొంత కాలంగా అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్-బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), తెలంగాణ జాగృతి సంస్థల సారధ్యంలో పోరాడుతున్న సంగతి విదితమే. తాజాగా కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, రిజర్వేషన్ల అంశంపై బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యంగంలో చట్ట సవరణలు చేయాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలంటూ కవిత కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు 20 డిమాండ్లతో కూడిన 35 పేజీల నివేదికను సమర్పించారు.