Bhudaan Lands: భూదాన్ భూముల వ్యవహారంలో సంచలనం.. డీజీపీకి నివేదిక సమర్పించిన ఈడీ

భూదాన్ భూముల (Bhudaan Lands) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-11-28 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: భూదాన్ భూముల (Bhudaan Lands) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ (Government), భూదాన్ (Bhudaan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ (IAS Amoy Kumar)పై ఈడీ (Enforcement Directorate) విచారణ ముగిసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ (Former IAS officer Amoy Kumar)పై కేసు నమోదుకు సిఫారసు చేస్తూ డీజీపీ జితేందర్‌ (DGP Jitender)కు నివేదికను సమర్పించింది. అదేవిధంగా అప్పట్లో మహేశ్వరం (Maheshwaram) తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన జ్యోతి (Jyothi), ఆర్డీవో వెంకటాచారి (RDO Venkata Chary)పై కూడా కేసులు నమోదు చేయాలని రికమెండ్ చేసింది. కాగా, రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మహేశ్వరం (Maheshwaram) మండలం నాగారం (Nagaram) గ్రామం పరిధిలోని సర్వే నెం.181లో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.

ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ కలెక్టర్‌గా పని చేసిన అమోయ్‌కుమార్‌ (Amoy Kumar) పాత్ర ఉన్నట్లుగా అక్కడి రైతులు ఈడీ (ED) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక మేడ్చల్ జిల్లాల్లోనూ అమోయ్‌ కుమార్ కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో భూ లావాదేవీలపై బాధితులు లిఖితపూర్వకంగా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమోయ్ కుమా‌ర్‌ను ఈడీ ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. రూ.కోట్లు విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చవకగా ఇతరులకు కేటాయించడంపై ఆయనను కొన్ని 5 రోజుల పాటు ప్రశ్నించింది. ఈ మేరకు అధికారులు ముందుగా అమోయ్ కుమార్ (Amoy Kumar), మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను రికార్ట్ చేశారు. వారిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అప్పటి ఆర్డీవో వెంకటాచారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. వారిచ్చిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి భూ ఆక్రమణలపై ఈడీ పూర్తి ఆధారాలను సేకరించి డీజీపీకి నివేదికను సమర్పించింది. తాజాగా, భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవీలపై తాజాగా భూదాన్ బోర్డు స్పందించింది. ఈ మేరకు తహసీల్దా్ర్ జ్యోతితో పాటు మరో నలుగురికి బోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న విచారణకు రావాలంటూ నోటీసులలో బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News