సచివాలయానికి వెళ్తుండగా ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి అరెస్ట్

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.

Update: 2023-05-04 10:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం అందజేయాలని అదేవిధంగా పంటలకు బీమా ప్రవేశపెట్టాలని గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేయడానికి బయలుదేరిన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, రైతు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం వారిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగిందని, కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల కోసం పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి, తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి, తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News