రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే..!
ప్రధాని మోడీ రేపు (మంగళవారం) తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ రేపు (మంగళవారం) తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లా టూర్ కు వస్తున్న ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 2.10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకుంటారు.
మధ్యాహ్నం 2.55 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.35 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3.45 నుంచి 4.45 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
4.55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలు దేరి 5.45కు బీదర్ ఎయిర్ పోర్ట్‌కు మోడీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు.
ఇక, పాలమూరు బహిరంగ సభలో మోడీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నిజామాబాద్ సభలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇందూర్ ప్రజా ఆశీర్వాద సభ అని తొలుత మీటింగ్ కు పేరు పెట్టిన కాషాయ పార్టీ తర్వాత పేరును మోడీ కృతజ్ఞత సభగా మార్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగున్న మీటింగ్ దృష్ట్యా బీజేపీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలు భారీగా తరలివచ్చేలా ప్లాన్ చేస్తోంది. మోడీ సభ నేపథ్యంలో నిజామాబాద్ కాషాయమయంగా మారింది.