నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి.. రెండ్రోజుల పర్యటన వివరాలివి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నేడు హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. రెండ్రోజుల పాటు నగరంలో పర్యటించనున్న ఆమె షెడ్యూల్ వివరాలను రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Update: 2024-11-21 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నేడు హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. రెండ్రోజుల పాటు నగరంలో పర్యటించనున్న ఆమె షెడ్యూల్ వివరాలను రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6 గంటలకు ద్రౌపది ముర్ము ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.20 గంటల నుంచి 7.10 వరకూ రాజ్ భవన్ (Raj Bhavan)లో విశ్రాంతి తీసుకుని.. 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium)లో భక్తి టీవీ (Bhakti Tv) నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం (Koti Deepotsavam) వేడుకకు హాజరవుతారు.

కోటి దీపోత్సవం ముగిసిన అనంతరం రాజ్ భవన్ కు చేరుకుని.. అక్కడే రాత్రికి బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 10.20 గంటలకు శిల్పకళావేదిక(Silpa Kalavedika)లో లోక్ మంథన్ (Lok Manthan) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు (Begumpet Airport)కు చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ(Delhi)కి తిరుగుపయనమవుతారు. 

Tags:    

Similar News