Gujjula Premender Reddy:దివ్యాంగులకు అండగా నిలుస్తున్న మోడీ ప్రభుత్వం

దివ్యాంగులకు ప్రధాని మోడీ అండగా నిలుస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-03 15:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగులకు ప్రధాని మోడీ అండగా నిలుస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేలలో ప్రత్యేక టాయిలెట్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. దివ్యాంగుల కోసం నిబంధనలను సవరించి త్వరగా సర్టిఫికెట్ తీసుకునేలా చొరవ చూపారన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దివ్యాంగుల కోసం రిజర్వేషన్లు మోదీ ప్రభుత్వం పెంచిదన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం పారా ఒలింపిక్స్ ను నిర్వహించిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు.

పారా ఒలింపిక్స్ లో గతంలో కంటే ఎక్కువ పథకాలు సాధించారన్నారు. దివ్యాంగుల పట్ల సింపతి కాదని వారికి అవకాశాలను ఇవ్వాలన్నారు. 2014 నుంచి నరేంద్రమోడీ నాయకత్వంలో దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. దివ్యాంగులు, సామాన్యులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారన్నారు. విద్యా, వ్యాపార రంగాల్లో రాణించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారని ఇదే స్ఫూర్తితో వారు మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6,016 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. ప్రత్యేక కోటా కింద ఇండ్లు, లోన్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఏడాది పాలనలో రూ.3లక్షల కోట్ల బడ్జెట్, రూ.80 వేల కోట్ల అప్పు తెచ్చి నా కళ్లు లేని ప్రభుత్వానికి దివ్యాంగులను ఆదుకోవాలనే సోయి లేదని విమర్శించారు. ఏడాది పాలన విజయోత్సవం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ రేవంత్ సర్కార్ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. తెలంగాణలో ఓ మోసగాడు గద్దెనెక్కాడు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


Similar News