ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి టీంను అభినందించిన డీజీపీ

అఖిల భారత లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణ పతకం గెలుచుకోవడం పట్ల ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి టీంను డీజీపీ డాక్టర్ జితేందర్ హృదయపూర్వకంగా అభినందించారు.

Update: 2024-12-03 14:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారత లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణ పతకం గెలుచుకోవడం పట్ల ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి టీంను డీజీపీ డాక్టర్ జితేందర్ హృదయపూర్వకంగా అభినందించారు. సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ పారా మిలిటరీ బలగాల కోసం నవంబర్ 26 నుండి 30 వరకు బెంగళూరులోని కేఎస్‌ఎల్‌టీఏ స్టేడియంలో ఛాంపియన్‌షిప్‌ జరిగింది. ఫైనల్స్‌లో ఐ జి పి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, నారాయణపేట ఆర్మ్‌డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ జంట, ఆంధ్రప్రదేశ్ బృందం డీఎస్పీలు రామ్ కుమార్ సత్యనారాయణపై నవంబర్ 30వ తేదీన విజయం సాధించారు.


Similar News