పోలీసుల ఆధీనంలోకి సభా ప్రాంగణం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

Update: 2022-11-28 06:06 GMT
పోలీసుల ఆధీనంలోకి సభా ప్రాంగణం
  • whatsapp icon

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భైంసా ఎఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సభా స్థలి వద్ద పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. సభ స్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఠాణాకు తరలించారు. సభా స్థలికి వెళ్లే మార్గంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ కాస్తున్నారు.

Tags:    

Similar News