బ్రేకింగ్: బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య.. కండువా కప్పి ఆహ్వనించిన KCR

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ జనగాంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో

Update: 2023-10-16 10:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ జనగాంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలోనే కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన పొన్నాల లక్ష్మయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనగాం టికెట్ ఆశించిన పొన్నాలకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి డబ్బులకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని.. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఏళ్ల నాటి బంధాన్ని పొన్నాల తెంచుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేత అయిన పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మంత్రి కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆయనను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ జనగాంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

Tags:    

Similar News