ప్రజలు ధైర్యంగా ఉన్నపుడే పోలీసులు సక్సెస్: CP డీఎస్ చౌహాన్
కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడటానికి మరింతగా కృషి చేయాలని రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ సూచించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడటానికి మరింతగా కృషి చేయాలని రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ సూచించారు. ఆయా కేసుల్లోని నిందితులను పట్టుకోవటంలో సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. రాచకొండ కమిషనరేట్‌లో కమిషనర్చౌహాన్మంగళవారం డీసీపీ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము భద్రంగా ఉన్నామని ప్రజలు భావించటమే పోలీసులకు పెద్ద ప్రశంస అని చెప్పారు. పాతనేరస్తుల కదలికలపై కన్నేసి పెట్టాలని, అంతర్రాష్ర్ట ముఠాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యల వల్ల నేరాల శాతం గణనీయంగా తగ్గిందన్నారు.
నేరాల దర్యాప్తులో సివిల్, ట్రాఫిక్పోలీసులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని చెప్పారు. సరైన నెంబర్ప్లేట్లు లేకుండా వాహనాలపై తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి రివార్డులు ఇస్తామన్నారు. కమిషనరేట్పరిధిలో మంజూరైన కొత్త పోలీస్ స్టేషన్లు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో జాయింట్కమిషనర్సత్యనారాయణ, మల్కాజిగిరి డీసీపీ జానకి, యాదాద్రి డీసీపీ రాజేశ్చంద్ర, ఎల్బీనగర్డీసీపీ సాయిశ్రీ, ఎస్వోటీ డీసీపీలు గిరిధర్, మురళీధర్, క్రైం డీసీపీ మధుకర్ స్వామి, రోడ్‌సేఫ్టీ డీసీపీ బాలు, అడ్మిన్డీసీపీ ఇందిర, అదనపు డీసీపీలు నర్మద, సమీర్తదితరులు పాల్గొన్నారు.