HYD: న్యూ ఇయర్ వేడుకల వేళ ఈ తప్పులు చేస్తే ఆరు నెలలు చిప్పకూడే?
దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలకు యువత సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలకు యువత సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. డీజే పాటలు, హుషారెత్తే డ్యాన్సులు, మందు, విందు, చిందు ఇలా అన్నింటికి పక్కగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేడకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సర వేడుకల పేరిట అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.
పోలీసుల నిబంధనలు:
= న్యూ ఇయర్ వేడుకలు రాత్రి ఒంటిగంట కల్లా ముగించాలి.
= 45 డెసిబుల్స్ శబ్ధం కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదు.
= ఎట్టి పరిస్థితుల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు.
= ఈవెంట్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి.
= ఈవెంట్‌లో మైనర్లు ఉంటే లిక్కర్‌కు అనుమతి లేదు
= డ్రగ్స్ వాడితే జీవితంలో కోలుకోలేని చర్యలు.
= కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు.
= ఈవెంట్ పేరుతో ట్రాఫిక్‌కు సమస్య సృష్టించొద్దు.
= డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్.