Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ రద్ధు కోసం సుప్రీం కోర్టుకు పోలీసులు ?

Update: 2024-12-17 10:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటన మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు(High Court)అల్లు అర్జున్ (Allu Arjun)కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ (Bail)ను రద్దు(Cancellation) చేయాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టు(Supreme Court)కు వెళ్లనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే అల్లు అర్జున్‌కు హైకోర్టు సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు నేరుగా సుప్రీంకు వెళ్లాలని కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నారని, ఇందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను కోరింది. అయితే హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోలీసులు చేప్పినా వినకుండా వచ్చి, అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వాదించారు. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పీపీ కోర్టు తెలిపారు. ఇదే వాదనతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు నెట్టింటా చక్కర్లు కొడుతూ బన్నీ అభిమానులను కలవరపెడుతున్నాయి. 

Tags:    

Similar News