Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
తెలంగాణ రైతాంగా(Telangana Farmers)నికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) శుభవార్త చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగా(Telangana Farmers)నికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) శుభవార్త చెప్పారు. సోయాబీన్(Soybean) అదనపు కొనుగోళ్ళకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన దానికంటే 25000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. ఈ వానాకాలం(2024) రాష్ట్ర ప్రభుత్వం, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా రైతుల వద్దనుండి ఇప్పటికే 59,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.4892తో సేకరించింది.
రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ల విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్దేశించిన పరిమాణం 59,508 మెట్రిక్ టన్నుల కంటే అదనంగా 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మార్క్ ఫెడ్ 49 సెంటర్ల ద్వారా సోయాబీన్ సేకరణ మంగళవారం కూడా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సోయాబీన్ రైతులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా మరొక 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. అయితే రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.