Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-11-11 08:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు (Chirumarthi Lingaiah) నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని పోలీసులు చిరుమర్తి లింగయ్యకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ జరిపినట్లు తేలడంతో పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. నేడే జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని తెలిపారు. చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ రాజకీయ నేతకు నోటీసులివ్వడం ఇదే తొలిసారి. 

Tags:    

Similar News