Big Alert:రాష్ట్రంలో నాలుగు రోజులు బ్యాంకు సేవలు బంద్.. కారణం ఇదే!

కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(Andhra Pradesh Grameen Vikas Bank)కు చెందిన తెలంగాణ బ్రాంచ్‌లు(Telangana Branches) విలీనం కానున్నాయి.

Update: 2024-12-19 12:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(Andhra Pradesh Grameen Vikas Bank)కు చెందిన తెలంగాణ బ్రాంచ్‌లు(Telangana Branches) విలీనం కానున్నాయి. ఈ మేరకు గత నెల(నవంబర్)లోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు రాష్ట్రంలోని పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. తెలంగాణలో ప్రజెంట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలందిస్తున్నాయి. కాగా.. ఈ రెండు బ్యాంకులు కలిసిపోనున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ కలవనుంది. ఈ ప్రక్రియ జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖపరమైన, ఆన్‌లైన్ సేవలు(UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, సీఎస్‌పీ) అందుబాటులో ఉండవని TGB తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ లోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది.

 

Tags:    

Similar News