PM Modi: తెలంగాణలో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
రైల్వే ప్రయాణికులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. ప్రజలకు సరసమైన, ఉచిత వైద్యం, మందులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. బుధవారం బిహార్ లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో 18 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను (Bhartiya Jan Aushadhi Kendras) జాతికి అంకితం ఇచ్చారు. తెలంగాణ (Telangana) లోని కాచిగూడ రైల్వేస్టేషన్ (kacheguda railway station)తో పాటు బిహార్, యూపీ, త్రిపుర, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ స్టేషన్లలో జన ఔషధి కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రయాణికులకు సరసమైన ధరలకు రైల్వే స్టేషన్లలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూస్తాయి.