Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి పిటీషన్
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జెలులో 14రోజుల రిమాండ్ లో ఉన్న ఏ 1 నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) కస్టడీ (custody )కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జెలులో 14రోజుల రిమాండ్ లో ఉన్న ఏ 1 నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) కస్టడీ (custody )కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఆయన ఫోన్ పరిశీలించేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. కేసులో మరో కీలక నిందితుడు బోగమోని సురేష్ కు, పట్నం నరేందర్ రెడ్డికి దాడికి సంబంధించి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పోలీసులు అడుగులేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కేటీఆర్(KTR) పేరును పేర్కొనడం, ఆయన ప్రేరణతోనే దాడి ప్రణాళిక అమలు చేశామని నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా పోలీసులు పేర్కొనడంతో ఈ కేసును కేటీఆర్ టార్గెట్ గా ముందుకు దూకిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చేసిన లగచర్ల కుట్రలో కేటీఆర్ తో పాటు ఇతరుల ఆదేశాలున్నట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.