అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా!

కాసులు కురిపిస్తే కాగలకార్యాన్ని గంధర్వులే తీరుస్తారన్నట్లుగా ఉంది అక్రమ నిర్మాణదారుడి తీరు.

Update: 2023-06-08 03:05 GMT

దిశ, దుండిగల్: కాసులు కురిపిస్తే కాగలకార్యాన్ని గంధర్వులే తీరుస్తారన్నట్లుగా ఉంది అక్రమ నిర్మాణదారుడి తీరు. ప్రైమార్క్ నిర్మాణదారుడు కట్టుకాలువలను కనుమరుగు చేస్తూ అక్రమ నిర్మా ణాలు చేపడుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డగోలుగా నిర్మాణా లు జరుగుతున్నా హెచ్ఎండీఏ అధికారులు పట్టుంచుకోరు. 2020 ఫిబ్రవరిలో అప్లికేషన్ నంబర్ 034566/ఎంఈడీ/ఆర్1/యూ6/హెచ్ఎండీఏ/25022020/25/02/2020 ద్వారా అనుమతి పొందిన నిర్మాణ దారుడు 2023 మార్చిలో శ్రీ రామ అయోధ్య డెవలపర్స్ ద్వారా 1017 గజాల స్థలం ఎక్చేంజ్ రూపంలో ల్యాండ్ పొందాడు. అనుమతులు కొనసాగించాలనుకున్న సదరు నిర్మాణదారుడు ల్యాండ్ ఎక్స్చేం జ్ అనంతరం హెచ్ఎండీఏ ద్వారా రివైజ్డ్ అనుమతిపొందాలి. కానీ బహదూర్ పల్లిలో ప్రైమార్క్ పేరుతో నిర్మిస్తున్న బిల్డర్ బొర్రా సాంబశివరావు హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలను కొనసాగొస్తుండడంపై అనుమానాలకు దారి తీస్తుంది. హెచ్ఎండీఏ అధికారులకు, స్థానిక మున్సిపల్ అధికారులకు తెలిసే నిర్మా ణాలు కొనసాగుతున్నాయా.. లేక అధికారుల కళ్లుగప్పి కొనసాగిస్తున్నాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి

ప్రైమార్క్ నిర్మాణాలపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం, గ్రామానికి చెందిన రాయన్నగారి అశోక్ రాజు వారసత్వం కింద అనుభవిస్తున్న తన స్థలాన్ని దాయాదుల ద్వారా కొనుగోలు చేసి ప్రైమార్క్ నిర్మాణదారుడు బొర్రా సాంబశివరావు తన 3 గుంటలు పొలాన్ని బలవంతంగా ఆక్రమించాడని తనకు న్యాయం చేయమంటూ ఓఎస్ నంబర్ 95/2018 ద్వారా కోర్టులో దావా వేశాడు. ఇలా గ్రామస్తులు అనేక కేసులు వేయడంతో సదరు నిర్మాణ దారుడు కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం. కోర్టు కేసులు స్థలం యజమానులకు అనుకూలంగా వస్తే కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉండడం ఆందోళన కలిగించే విషయం.

అన్నీ తెలిసినా..?

దుండిగల్ మున్సిపాలిటీ, బహదూరపల్లిలో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మిస్తున్న ప్రైమార్క్ అపార్టుమెంట్స్‌కు హెచ్ఎండీఏ ద్వారా స్టిల్ట్ ప్లస్ 8 అంతస్తుల అనుమతితో 2020 ఫిబ్రవరిలో అనుమతి పొంది నిర్మాణాలు చేపట్టాడు. ఇంత వరకు బాగానే ఉన్నా సదరు నిర్మాణదారుడు 2023 మార్చిలో శ్రీ రామ అయోధ్య డెవలపెర్స్ ద్వారా 1017 గజాలు ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద పొందాడు. పాత అనుమతుల ద్వారా నిర్మాణాలు కొనసాగిస్తున్నాడంటూ స్థానికులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు టీపీవో సాయిబాబా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అయినా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాసులకు కక్కుర్తి పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణదారుడికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News