Jammikunta: పత్తి కొనుగోళ్లలో దోపిడి.. వ్యాపారుల తీరుతో నష్టపోతున్న రైతులు
రైతుకు న్యాయం జరిగేది ఎన్నడు. ప్రభుత్వాలు మారినా, పద్ధతులు మారినా, మార్కెట్ కమిటీ మారినా, రైతుకు న్యాయం జరగడం లేదు.
పత్తి కొనుగోళ్లలో రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుకు సరైన న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలు, పద్ధతులు మారినా, రైతులకు పంట విక్రయాల్లో న్యాయం జరగకపోగా తీవ్రంగా నష్టోపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మే వరకు రైతన్న అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. అప్పులు తెచ్చి పంటలు పండించినా ఆ ఫలితాన్ని రైతులు అందుకోలేక పోతున్నారు. ఇకనైనా రైతును మోసం చేయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అన్నదాతలు అధికారులను కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి విత్తనం పెట్టిన నాటి నుంచి పంట పండించి తీరా ఆ పంటను అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడ్డగోలుగా వ్యాపారులు, మిల్లుల యజమానులు తేమ శాతమంటూ ఇతర కారణాలు చూపుతూ మద్దతు ధర ఇవ్వడం లేదు. దీంతో రైతులు చేసేది లేక పత్తిపంటను దళారులు చెప్పిందే వేదంగా నమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.
దిశ, జమ్మికుంట టౌన్: రైతుకు న్యాయం జరిగేది ఎన్నడు. ప్రభుత్వాలు మారినా, పద్ధతులు మారినా, మార్కెట్ కమిటీ మారినా, రైతుకు న్యాయం జరగడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మే వరకు రైతన్న అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. అప్పులు తెచ్చి పంటలు పండించినా ఆ ఫలితాన్ని రైతులు అందుకోలేక పోతున్నారు. ఇకనైనా రైతును మోసం చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆరుగాలం ప్రకష్టపడి విత్తనం పెట్టిన నాటి నుంచి పంట పండించి తీరా ఆ పంటను అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడ్డగోలుగా వ్యాపారులు, మిల్లుల యజమానులు రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
తీరుమారని మిల్లు యజమానులు..
గతంలో మార్కెట్ కార్యదర్శి రైతులకు మార్కెట్‌లో పత్తి రేటుకు ఏదో సాకు చెప్పి మిల్లులోకి వచ్చాక మరో రేటు వేయొద్దని జిల్లా మార్కెట్ అధికారి సూచించారు. కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేయవద్దని, రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించినా మిల్లుల యజమానులు రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆడ్తిదారుల దోపిడీ...
రైతులు మార్కెట్‌కు తీసుకురావాలంటే మధ్యవర్తుల్లా చలామణి అవుతున్న అత్తిదారులు రైతుల నుంచి రూ.6500కు కొనుగోలు చేస్తున్నారు. అదే పత్తిని తమ బినామీ పేర్ల మీద సీసీఐకు రూ.7500చొప్పున అమ్ముకుంటున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అంతేకాకుండా రైతుల నుంచి క్యాష్ కటింగ్ అని ఇంకా ఇతర కటింగ్‌లను రైతులపై వేసి మోసం చేస్తున్నారు. ఈ దోపిడీ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు నేరుగా సీసీఐకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టాలని, రైతులను దోపిడీకి గురికాకుండా చూసుకోవాలని కోరారు.
మిల్లు యాజమాన్యం సైతం మోసం...
రైతులు దూర తీరాల నుంచి తీసుకురావడానికి ట్రాలీ వ్యాన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ ట్రాలీ వాహనదారులు మిల్లు యాజమాన్లతో కుమ్మక్కై నేరుగా మిల్లుకు తీసుకొస్తున్నారు. రైతుల నుంచి పత్తిని రూ.6400 నుంచి రూ.6,600వరకు కొనుగోలు చేసి అదే పత్తిని బినామీ పేర్లతో సీసీఐకు అమ్ముకుంటూ రూ.లక్షల్లో లాభాలు గడుస్తున్నారని రైతులు తెలిపారు. సీసీఐలో నేరుగా అమ్ముకునేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు కోరుతున్నారు. జమ్మికుంట పట్టణానికి దూరంగా ఉన్న గ్రామాల్లో పత్తి సేకరణకు పత్తి వ్యాపారులు ఇండ్ల దగ్గరికి వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఆ పత్తిని జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చి సీసీఐకి అమ్ముకొని అధిక మొత్తంలో లాభాలు గడిస్తున్నారు. కౌలు రైతులు సీసీఐకు అమ్ముకోలేక వ్యాపారులకు అమ్ముకొని మోసపోతున్నారు. కౌలు రైతు పత్తిని సీసీఐ కొనేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రైతులు దూరం నుంచి మార్కెట్‌కు తీసుకురాలేక మార్కెట్‌లో రేటు తెలియకుండా వ్యాపారస్తులు మభ్యపెట్టి రూ.6500 మాత్రమే పడుతుందని చెప్పి వారి నుంచి అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారు.
నామమాత్రంగా మార్కెట్ కమిటీ..
రైతుల కోసం ఏర్పడిన మార్కెట్ కమిటీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని పలువురు వాపోతున్నారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పత్తి రైతులకు పత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. రైతులు మోసానికి గురికాకుండా చర్యలు తీసుకోవడం లేదని, ఇకనైనా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. రైతులు మార్కెట్‌కు వస్తే తమకు గిట్టుబాటు ధర అందుతుందని కొన్ని నెలలుగా ఎదురు చూశారు. కానీ కమిటీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.