Pawan Kalyan : అల్లు అర్జున్‌కు పవన్ కల్యాణ్ బిగ్ షాక్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒక రోజు జైలు అనంతర బెయిల్ పై విడుదలైన హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను పరామర్శించకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan)బిగ్ షాక్ ఇచ్చారు.

Update: 2024-12-15 06:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒక రోజు జైలు అనంతర బెయిల్ పై విడుదలైన హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను పరామర్శించకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan)బిగ్ షాక్ ఇచ్చారు. నిన్న రాత్రినే హైదరాబాద్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ ఆదివారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి సంఘీభావం చెబుతారని బన్నీ, మెగా అభిమానులు భావించారు. వారందరి అంచనాలకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలువకుండానే తిరిగి ఏపీకి వెళ్లిపోవడం సంచనంగా మారింది. అల్లు అర్జున్ కు ఈ రకంగా పవన్ కల్యాణ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారన్న చర్చలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారం పవన్ కల్యాణ్ కు, అల్లు అర్జున్ కు మధ్య విభేధాలకు నిదర్శనంగా నిలిచిందంటున్నారు. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం ఇంకా సమసిపోలేదని భావిస్తున్నారు.

అయితే మెగా కుటుంబం నుంచి చిరంజీవి సురేఖ దంపతులు, నాగబాబు ఇప్పటికే అల్లు అర్జున్ ను పలకరించారు. మెగా హీరో రాంచరణ్ మాత్రం పలకరింపుకు రాలేదు. టాలీవుడ్ నటులంతా అల్లు అర్జున్ కు సంఘీభావం చెబుతున్న క్రమంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వచ్చి మరి అల్లు అర్జున్ ను కలవకపోవడంతో ఆయన అరెస్టు వెనుక పవన్ హస్తం కూడా ఉందా అన్న సందేహాలను బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ ఘటనపై వారు చర్చించనున్నట్లుగా సమాచారం. 

అయితే సంధ్యా థియేటర్ ఘటనలో తల్లి చనిపోగా, కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడని..ఈ సమయంలో అల్లు అర్జున్ ను పలకరిస్తే అనవసరంగా చట్టానికి, పోలీసులకు వ్యతిరేకంగా బన్నీకి మద్ధతునిచ్చిన సంకేతాలు వెలుతాయని డిప్యూటీ సీఎం హోదాలో అది మంచిది కాదని భావించి పవన్ కల్యాణ్ పలకరింపుకు రాలేదని విశ్లేషకులు అంటున్నారు. అదిగాక రెండు రాష్ట్రాల మధ్య అనవసర అపోహాలకు అవకాశమివ్వడం ఎందుకన్న ఆలోచనతో అల్లు అర్జున్ ను పవన్ కల్యాణ్ పలకరించకుండా తిరిగి వెళ్లారని చెబుతున్నారు.

Tags:    

Similar News