Deputy CM Bhatti: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం సరికాదు.. బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం ఫైర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) విపరీతంగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.54 వేల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు.
అసెంబ్లీ (Assembly)లో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ నిధులను ఏడాదిలోపే వారి ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ.66,722 కోట్లు అప్పులు కడుతున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ (BRS) చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. సంక్రాంతి (Sankranthi) తరువాతే రైతు భరోసా (Raithu Bharosa) వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రొత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తాము బీఆర్ఎస్ (BRS) నేతలు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పలేమని.. వారి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.