BIG News: మంత్రివర్గంలోకి ఆ నలుగురు..? ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు టైమ్ ఫిక్స్ అయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు టైమ్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు సీఎం రేవంత్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్తదితరులున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. సీఎం, గవర్నర్‌లు ఇరువురు ప్రత్యేకంగా సంభాషించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి అధికారికంగా సీఎం రేవంత్ గవర్నర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వచ్చేనెల 3వ తేదీ నాడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. దానికి తోడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, సన్నబియ్యం పంపిణీ పథకం గురించి తెలియజేసినట్టు సమాచారం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులు, తీర్మాణాలను తదితర వాటిని ఆయనకు వివరించినట్లు తెలిసింది.
మంత్రివర్గంలోకి ఆ నలుగురు..
గవర్నర్‌తో భేటీ సందర్భంగా మంత్రివర్గంలోకి ఎవరెవరినీ తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నలుగురి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లుగా అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది.అయితే, చివరి నిమిషంలో ఏమైనా కొత్త పేర్లు చేరుతాయా..? అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నది.