Tiger : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి పెద్దపులి ఎంటర్ ..గ్రామాల్లో అలర్ట్ !
ములుగు జిల్లా తాడ్వాయి(Tadwai) పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి.. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోకి ప్రవేశించింది.
దిశ, వెబ్ డెస్క్ : ములుగు జిల్లా తాడ్వాయి(Tadwai) పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి (Tiger) భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో పులి సంచరించే ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అలర్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అల్లపల్లి మండలాల్లో గత మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం పినపాక ఇల్లందు కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ పులి అటు ములుగు జిల్లాలోకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి తిరుగుతు అటవీ యంత్రాంగాన్ని, ప్రజలను పరేషాన్ చేస్తోంది.
కొత్తగూడెం జిల్లాలో గతంలో మూడేళ్ల క్రితం కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచరించగా..అది ఒక ఆవుని కూడా చంపి తినేసింది. కొన్ని నెలల తర్వాత టేకులపల్లి మండలంలో సంచరించి వ్యవసాయ పనులకెళ్లిన రైతులను భయాందోళనకు గురిచేసింది. తర్వాతా మళ్ళీ ఇన్నాళ్లకు పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. పెద్దపులి రోజుకు 20కిలో మీటర్లు తిరిగే అవకాశముందని, గ్రామాల్ల ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు.