ఇక అక్కడ కూడా అపోలో ఉచిత సేవలు.. ఉపాసన కీలక ప్రకటన
అయోధ్యలోని (Ayodhya) రామమందిరం (Ram Temple) ప్రాంగణంలో భక్తులకు అపోలో హస్పిటల్స్ (Apollo Hospitals) తరుఫున ఉచిత అత్యవసర వైద్య సేవలను ప్రారంభిస్తునట్లు రాంచరణ్ (Ramcharan) సతీమణి ఉపాసన (upasana) తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలోని (Ayodhya) రామమందిరం (Ram Temple) ప్రాంగణంలో భక్తులకు అపోలో హస్పిటల్స్ (Apollo Hospitals) తరుఫున ఉచిత అత్యవసర వైద్య సేవలను ప్రారంభిస్తునట్లు రాంచరణ్ (Ramcharan) సతీమణి ఉపాసన (upasana) తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు హజరువుతున్నారని పేర్కొన్నారు. భక్తులు ఎవరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా సకాలంలో వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. నిజమైన సనాతన ధర్మంలోనే జాలి, దయ ఉంటుందని తాతయ్య ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తు చేశారు. ఆయన మాటలే స్ఫుర్తిగా తీసుకుని నేడు అయోధ్య రామ మందిరంలో అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అపోలో వైద్య సేవలను రామమందిరంతో పాటు శ్రీశైలం(Srisailam),కేదార్‌నాథ్ (Kedarnath),బద్రీనాథ్ (Badrinath) వంటి ప్రముఖ క్షేత్రల్లో కూడా కొనసాగుతున్నాయని.. జై శ్రీరామ్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.