Gandhi Bhavan: బాంబ్ పేల్చిన TPCC చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ అనుచరులు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యతలు చేపట్టి నేటితో వందరోజులు పూర్తయింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యతలు చేపట్టి నేటితో వందరోజులు పూర్తయింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచ కాల్చి సంబురాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్ 15వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జులై 7తో అప్పటివరకూ టీపీసీసీ చీఫ్(TPCC chief )గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పదవీకాలం ముగిసింది. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్‌కు అవకాశం ఇచ్చింది.
అంతకుముందు పదవి కోసం నలుగురు ఐదుగురు లీడర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపించాయి. వీరంతా పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు సైతం చేశారు. అయితే అనూహ్యంగా పార్టీ అధిష్ఠానం మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించింది. ఆయన నియామకాన్ని తెలియజేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేయడంతో ఉత్కంఠకు తెర వీడింది.