HYD: జనసేన ఆఫీస్‌లో పవన్ కల్యాణ్.. త్వరలోనే వాళ్లను కలుస్తానని హామీ

హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Update: 2022-09-30 03:33 GMT
HYD: జనసేన ఆఫీస్‌లో పవన్ కల్యాణ్.. త్వరలోనే వాళ్లను కలుస్తానని హామీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌లో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించి ప్రణాళికలు రూపొందించారు. సోషల్ మీడియా-శతఘ్ని క్రియాశీలక సభ్యులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. సోషల్ మీడియా టీమ్‌లతో జిల్లాల వారీగా సమీక్షలు జరుపనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News