Pavan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావుడి మొదలైంది.

Update: 2025-02-14 09:13 GMT
Pavan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావుడి మొదలైంది. నామినేషన్ల (Nominations) ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో తుది పోరులో నిలిచేది ఎవరో తేలిపోయింది. అయితే, 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల అయిపోయేంత వరకు పార్టీ విజయానికి మంత్రులు, ఎమ్మె్ల్యేలు సమర్ధవంతంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే జనసేన (Janasena) చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pavan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల (Parliamentary Constituencies) వారీగా కో-ఆర్డినేటర్లను నియమించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన (Janasena) తరపున పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోఆర్డీనేటర్లను నియమించారు. ఈ మేరకు కాకినాడ-తుమ్మల రామస్వామి, రాజమండ్రి-వై. శ్రీనివాసరావు, అమలాపురం- బండారు శ్రీనివాసరావు, నరసాపురం-చన్నమల్ల చంద్రశేఖర్, ఏలూరు-రెడ్డి అప్పల నాయుడు, విజయవాడ-అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నం- బండి రామకృష్ణ, గుంటూరు- నయబ్ కమల్, నరసరావు పేట-వడ్రాణం మార్కండేయ బాబును సమన్వయకర్తలుగా నియమించారు. పక్కా ప్రణాళికల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేయాలని వారికి పవన్ సూచించారు. 

Tags:    

Similar News