ఏఐతో ప్రతి వ్యక్తి భవిష్యత్తుకు బాటలు.. మంత్రి శ్రీధర్ బాబు

కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Update: 2024-10-07 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీలో సోమవారం బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సంస్థ ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని రంగాల్లో అత్యున్నత ప్రమాణంగా కృత్రిమ మేధ దోహదపడుతుందని తెలిపారు. సాంకేతికత వినియోగం ఆరోగ్య సంరక్షణలో మాత్రమే కాదు.. ఇది జీవితాలను మార్చడానికి సంబంధించినదని అన్నారు. కృత్రిమ మేధస్సుకు సంబందించిన శక్తిని ఉపయోగించడం ద్వారా, రోగ నిర్ధారణను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. చికిత్సను వ్యక్తికరించి మెరుగైన ఫలితాలను అందించడంతో పాటు అధునాతన సాంకేతికతతో ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా, బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ జానకి యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు.


Similar News