New Year Celebration : చుక్కేసి సెక్స్ చేసి.. డిసెంబర్ 31 నైట్ యూత్ హంగామా (వీడియో)

న్యూ ఇయర్ అంటేనే జోష్.. చుక్క, ముక్క పక్కా అంటారు. కానీ ఈ ఏడాది యూత్ సెక్స్‌ కూడా అంటూ ఎంచక్కా ఎంజాయ్ చేశారు.

Update: 2025-01-01 09:29 GMT

Full View

దిశ, వెబ్‌డెస్క్ : న్యూ ఇయర్ అంటేనే జోష్.. చుక్క, ముక్క పక్కా అంటారు. కానీ ఈ ఏడాది యూత్ సెక్స్‌ కూడా అంటూ ఎంచక్కా ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 31 నైట్ కోసం చిన్నా పెద్ద తేడా లేకుండా ఎదురు చూస్తుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్న ఆనందంలో.. పాత సంవత్సరం కాలగర్భంలో కలిసి పోతుందనే కారణంతో చివరి పార్టీ అంటూ చిల్ అవుతుంటారు. ముఖ్యంగా యూత్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. రెండు, మూడు రోజులు ముందే ప్లాన్ చేసుకోని పార్టీలు చేసుకుంటారు. కొందరు ఇతర ప్రాంతాలకు టూర్లు వెళ్లి మరీ న్యూ ఇయర్ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటారు. ఇదంతా ఎలా ఉన్నా ఈ సారి హైదరాబాద్ యువత చుక్కా, ముక్కాతోపాటు సెక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఎంతలా అంటే వాలంటెన్స్ డేను మించిపోయేలా అంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్ 31న కండోమ్స్ కోసం ఆర్డర్లు పెట్టి రికార్డు సృష్టించారు.

ఇయర్ ఎండ్ తీపి జ్ఞాపకం అనుకున్నారో.. లేక తాగిన మత్తులో శృంగారంలో తేలిపోదాం అనుకున్నారో కానీ డిసెంబర్ 31న హైదరాబాద్‌లో కండోమ్స్‌ భారీగా సేల్స్ జరిగాయి. ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ (Swiggy Instamart')లో మంగళవారం ఒక్కరోజే భారీగా కండోమ్ ప్యాకెట్ల (Condom Packets)కు ఆర్డర్లు వచ్చినట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5.30 వరకు 4,779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్లుగా స్విగ్గీ తెలిపింది. ఈ ఆర్డర్లు వాలెంటైన్స్ డే (Valentine's Day)లను కూడా అధిగమించాయని ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ ప్రతినిధులు తెలిపారు.

ఇక నూతన సంవత్సరం వేడుకలు ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. 2024 డిసెంబర్ 30వ తేదీ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30, 31వ తేదీ రెండు రోజుల్లో రూ.1,000 కోట్ల మద్యం అమ్మకాలే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు, 1,117 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ ఉన్నాయి. 51 కంపెనీల ద్వారా 1,000 రకాల మద్యం ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొంది ఉన్నది. ఆయా ప్రాంతాలకు 19 డిపోల నుంచి బేవరెజ్ సంస్థ మద్యం సరఫరా చేస్తోంది. ప్రతి నెలా 40 లక్షల నుంచి 45 లక్షల కేసుల బీర్లు, 30 లక్షల నుంచి 35 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రి మొత్తం పోలీసులు నగర వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాత్రి మొత్తం 1184 మంది మద్యం బాబులు పట్టుబడ్డారు.

Tags:    

Similar News