Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు కొత్త పథకాలపై కీలక ప్రకటన..!

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ సచివాలయం (Secretariat)లో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ (Cabinet) సమావేశం కానుంది.

Update: 2025-01-04 02:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ సచివాలయం (Secretariat)లో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ (Cabinet) సమావేశం కానుంది. ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘రైతు భరోసా’ (Raithu Bharosa) విధివిధానాలు నేటి సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. చర్చలు, సంప్రదింపుల తరువాత కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committe) రైతు భరోసాపై విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు పంట వేసిన వారందరికీ పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీ, సన్నబియ్యం పంపిణీపై సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై డిస్కస్ చేయనున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్‌కు సర్వే గణాంకాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయానికి టీటీడీ (TTD) తరహాలో ప్రత్యేక బోర్డు (Special Board) ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 20 మందితో కూడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Tags:    

Similar News