వార్డు మెంబెర్‌గా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి పవర్సా..కేటీఆర్ ట్వీట్ వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ట్వీట్ చేశాడు. వార్డు మెంబెర్‌గా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి పవర్స్.. ఇవ్వడం కేవలం ఎనుముల రాచరిక పాలన లో మాత్రమే జరుగుతుందని సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి కి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి సంచలన ట్వీట్(Tweet) చేశాడు. వార్డు మెంబెర్‌గా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి పవర్స్.. ఇవ్వడం కేవలం ఎనుముల రాచరిక పాలన(Monarchy) లో మాత్రమే జరుగుతుందని సీఎం సోదరుడు(CM's brother) ఎనుముల తిరుపతి రెడ్డి(Enumula Tirupati Reddy)కి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు మనుమల తిరుపతి రెడ్డి.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ(Distribution of Kalyan Lakshmi Cheques) చేస్తున్నట్లు ఓ పత్రికా రాసుకొచ్చింది. కాగా ఇదే విషయంపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రశ్నిస్తూ.. ట్వీట్ చేశారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి అధికారిక కార్యక్రమంలో పాల్గోనడం.. రాజ్యాంగబద్ధ వ్యవస్థ లో జరగదని, కేవలం ఎనుముల రాచరిక పాలన లో మాత్రమే జరుగుతుందని కేటీఆర్ రాసుకొచ్చారు. అలాగే ఎమెల్యేకి బదులుగా ప్రభుత్వ అధికార కార్యక్రమాలలో పాల్గొనడానికి తిరుపతి రెడ్డి(Tirupati Reddy) ఎవరు, కల్యాణలక్ష్మి చెక్కులను ఏ అధికారంతో పంపిణీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే కొడంగల్ కి కొత్త ఎమ్మెల్యే కావాలని ప్రజలు అనుకుంటే ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది కదా.. ఈ రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి అని మండిపడ్డారు. తెలంగాణ లో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని భారత రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఇది తెలుసా అంటూ తన ట్వీట్ లో కేటీఆర్(KTR) ప్రశ్నించారు.