BJP : హిందూ పండుగలపై ఎందుకు ద్వేషం! దీపావళి వేళ 144 సెక్షన్.. బీజేపీ ఆసక్తికర పోస్ట్

హైదరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ నిన్న హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-28 12:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ నిన్న Hyderabad హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఐదుగురికి మించి రోడ్లపై, ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో గుమిగూడొద్దని స్పష్టం చేశారు. నిరసనలు, ధర్నాలు ధర్నా‌చౌక్‌లో తప్ప ఇతర ప్రదేశాల్లో అనుమతి లేదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ BJP Telangana ఎక్స్ వేదికగా Congress కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరో వర్గంపై వివక్ష చూపడమేనా కాంగ్రెస సెక్యులరిజం? అని ప్రశ్నించింది.

హిందూ పండుగలపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించింది. ప్రతి పండుగకు ఏదో విధంగా కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటుందని ఫైర్ అయింది. హిందూ పండుగలపై కాంగ్రెస్‌కు ఎందుకింత ద్వేషం? అని ఫోటో పోస్ట్ చేసింది. దసరా నవరాత్రుల్లో డీజే బ్యాన్, దీపావళి పండుగ వేళలో 144 సెక్షన్, వినాయక నిమజ్జనంపై ఆంక్షలు పెట్టిన విధానం, బతుకమ్మ పండుగకు కరెంట్ తీసేసిన వైనం.. అని తెలంగాణ బీజేపీ పోస్టర్‌లో పేర్కొంది.

 

దీపావళి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదు: హైదరాబాద్ సీపీ

అదేవిధంగా 144 section 144 సెక్షన్‌ విధింపు ప్రస్తుతం చర్చానీయశంగా మారింది. కొంత మంది కావాలని సోషల్ మీడియాలో నెల రోజుల పాటు కర్ఫ్యూ అంటూ కూడా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని Hyderabad CP హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. దీనిపై తాజాగా ఎక్స్ వేదికగా సీపీ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌కి Diwali festival దీపావళి పండుగ వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అనేక రకాల ఆందోళనలు, సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ మొదలైన వాటిపై కొన్ని గ్రూపులు ఆకస్మిక దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపిందని పేర్కొన్నారు. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా పోలీసులు ఇలాంటి విధానాలు అవలంబిస్తారని, ఇది కర్ఫ్యూ కాదు.. కొందరు తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News