క్యాబ్‎లో ప్రయాణించే వారికి నో ఏసీ క్యాంపెయిన్ షాక్

ఏసీ క్యాబ్ లలో హాయిగా ప్రయాణిద్దామనుకునే వారికి క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇస్తున్నారు.

Update: 2024-04-10 06:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఏప్రిల్ లోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రయాణాలు చేయాలనుకునే వారు బైకులు, ఆటోలకు బదులు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నాయి. ఏసీ క్యాబ్ లలో హాయిగా ప్రయాణిద్దామనుకునే వారికి క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇస్తున్నారు. రైడ్ సమయంలో ఏసీ ఆన్ చేయాలంటే ఎక్స్ ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం నో ఏసీ క్యాంపెయిన్ ను సైతం రన్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని దీంతో విధిలోని పరిస్థితుల్లో కొందరు అదనపు డబ్బులిచ్చి ఏసీ వేయించుకుంటుంటే మరి కొందరేమో క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు కంప్లయింట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ నో ఏసీ క్యాంపెయినింగ్ ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఏమిటి ఈ 'నో ఏసీ' క్యాంపెయిన్?:

వేసవి తాపం కారణంగా కస్టమర్లు ఏసీ వేయాలని కోరుతున్నారు. అయితే ఏసీతో క్యాబ్‌లను నడిపితే కిలోమీటరుకు రూ.16 నుండి రూ.18 ఖర్చు అవుతుంది. కానీ ప్రస్తుతం ఉబెర్, ఓలా, రాపిడో సంస్థల నుంచి కమిషన్ పెరగకపోవడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవర్లు నో ఏసీ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ టీజీపీడబ్యూయూ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వానికి మరియు ప్లాట్‌ఫారమ్ కంపెనీలకు మా అభ్యర్థనలు వినబటం లేదు. అందుకే ఇకే నో ఏసీ క్యాంపెయిన్ ప్రారంభించడం మినహా మాకు మరో మార్గం లేదని యూనియన్ ప్రకటించింది. హైద‌రాబాద్ క్యాబ్‌ల్లో రెండు రోజులుగా నో ఏసీ రగ‌డ పెద్ద దుమార‌మే రేపుతోంది.

Tags:    

Similar News