NLG: మంత్రి కోమటిరెడ్డిపై గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-23 12:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబుజా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ నేతలు నల్లగొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గాదరి కిశోర్ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఆయన 'కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాదు *జ్జా వెంకట్ రెడ్డి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు కోమటిరెడ్డి నోటిని ప్రక్షాళన చేయాలన్నారు. కోమటిరెడ్డి తాను ఇంజనీర్ అని చెప్పుకుటున్నాడని, నిజానికి ఆయన చదువుకునే రోజుల్లోనే సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్లు తాగేవాడని ఆరోపించారు. అంతేగాక కోమటిరెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదని మున్నా భాయ్ ఇంజనీర్ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గాదరి కిశోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.


Similar News