తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

తాడ్వాయి మండల కేంద్రంలోని బీసీ కాలనీ లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో గురువారం ఉదయం బీసీ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

Update: 2024-02-21 03:08 GMT

దిశ, తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని బీసీ కాలనీ లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో గురువారం ఉదయం బీసీ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కాలనికి సమీపంలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ భగీరథ నీరుతో కొంత మేర నీటి సమస్య తీరుతుండే కానీ భగీరథ నీరు సరఫరా చెయ్యకపోవడంతోనె నీటి కొరత ఏర్పడుతుందని వారు తెలిపారు. 100 కుటుంబాలు ఉన్న బీసీ కాలనీకి పంచాయతీ బోర్ల నుంచి కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చోరువచుపి తాడ్వాయి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.


Similar News