రైతు సొసైటీ ముందు మహిళ నిరసన
పంట రుణం ఇవ్వడంలేదని ఓ మహిళా రైతు సొసైటీ కార్యాలయం ముందు నిరసన దిగింది.
దిశ,బాన్సువాడ : పంట రుణం ఇవ్వడంలేదని ఓ మహిళా రైతు సొసైటీ కార్యాలయం ముందు నిరసన దిగింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నస్రుల్లాబాద్ మండలం బొప్పస్ పల్లి తండాకు చెందిన అంజుబాయి తనకు పంట రుణాలు ఇవ్వడం లేదని బైరాపూర్ సొసైటీ ముందు భైఠాయించి నిరసన తెలిపింది. తాము తీసుకున్న రుణమాఫీ అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రుణం ఇవ్వకుండా తిప్పుతున్నట్లు తెల్పింది. రుణం ఇవ్వకుంటే సొసైటీ ముందు ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది.