ముగ్గురు టెన్త్ విద్యార్థినులు అదృశ్యం..
మండల కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో 10 వ తరగతి
దిశ, నవీపేట్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక లు అదృశ్యమయ్యారు. గురువారం నాడు స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి ఎక్కడికో వెళ్లారని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విద్యార్థుల కొరకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.విద్యార్థినీలు ఎక్కడైనా కనిపిస్తే నవీపేట్ ఎస్సై మొబైల్ నెంబర్ 8712659845 నార్త్ రూరల్ సీఐ. 8715659843 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని నవీపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.