సావిత్రి బాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి
సావిత్రి బాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
దిశ, కామారెడ్డి : సావిత్రి బాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సావిత్రి బాయి ఫూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మహిళల కోసం సావిత్రి బాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విద్యాబోధన చేయడం జరిగిందని తెలిపారు. తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో పాఠశాలలు ఏర్పాటు చేసి, మహిళలకు విద్యాబోధన అందించడం జరిగిందని తెలిపారు. సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి పనిచేశారని తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం ఆమె ఎంతో కృషి చేశారని వివరించారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్ మాట్లాడుతూ..సామాజిక సేవా కార్యక్రమాలను సావిత్రి బాయి నిర్వహించారని, పెద వర్గాలవారికి విద్యను అందించిన వ్యక్తి అని అన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, మహిళ ఉపాధ్యాయురాళ్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్య శాఖాధికారి రాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి...
ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం నూతనంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్ లైన్ బోరు నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమీషనర్ స్పందన, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, మిషన్ భగీరథ ఈ ఈ రమేష్, సిడిపీఓ రోఛిష్మ, తహసీల్దార్ జనార్ధన్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.