77 కి చేరిన స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ ప్రోగ్రాం..

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని కార్యక్రమం ఆదివారంతో 77వ వారానికి చేరుకుంది.

Update: 2025-01-05 10:48 GMT

దిశ, ఆలూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని కార్యక్రమం ఆదివారంతో 77వ వారానికి చేరుకుంది. ప్రధాన రోడ్డు వీధిలో ఉన్న మురుగు కాలువ, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో కుక్కలు, కోతుల బెడద త్రీవంగా ఉందని వీటి నివారణకు మున్సిపాలిటీ వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాలనీ సభ్యుల సహకారంతో నేటికి 77 వ వారానికి చేరిందని, 2025 వ సంవత్సరంలో మొదటి కార్యక్రమమని ఈ ఏడాదంతా ఇదే ఉత్సాహంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొంకేర భూమన్న, కొంతం రాజు, గణేష్, రాజ్ కుమార్, రవి, సాయన్న, జయ రాజ్, మాణిక్యం, మహదేవ్, రాజన్న, లక్ష్మణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


Similar News