గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
గాంధారి మండలం సీతాయిపల్లి,చెన్నాపూర్ గ్రామ శివారు పరిధిలో అటవి ప్రాంతంలో గుర్తుతెలియ పురుషుడు శవం లభించినట్టు సదాశివనగర్ సీఐ సంతోష్ తెలిపారు.
దిశ , గాంధారి: గాంధారి మండలం సీతాయిపల్లి,చెన్నాపూర్ గ్రామ శివారు పరిధిలో అటవి ప్రాంతంలో గుర్తుతెలియ పురుషుడు శవం లభించినట్టు సదాశివనగర్ సీఐ సంతోష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..వ్యక్తి వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని ,భవానిపేట్ రోడ్డుకు అర కిలోమీటర్ లోపల అడవిలో బామన్ కుంట ఎత్తుగడ్డ పైన చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఉండడం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిలాల్ వార్ రవి గమనించి గాంధారి పోలీసులకు సమాచారం ఇచ్చారని వారు తెలిపారు. ఘటన జరిగి 20 నుండి 25 రోజులు కింద జరిగినట్లు ఉందని పోలీసులు తెలిపారు. సదాశివనగర్ సీఐ సంతోష్ గౌడ్ , గాంధారి ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి వెళ్లి నేరస్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు . మృతుడు పచ్చ,తెలుపు కలర్ టవల్,నీలి రంగు తెల్లని,లేత పసుపు రంగు లైనింగ్ ఫుల్ షర్ట్,బ్లాక్ కలర్ జీన్ ప్యాంటు, నల్లని డ్రాయర్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.