జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

మండల కేంద్రానికి చెందిన పాటిల్ దీపక్ (30) ఉరేసుకుని మృతి చెందినట్లు మంగళవారం ఎస్సై విక్రమ్ తెలిపారు.

Update: 2025-01-07 16:17 GMT

దిశ, మోర్తాడ్ : మండల కేంద్రానికి చెందిన పాటిల్ దీపక్ (30) ఉరేసుకుని మృతి చెందినట్లు మంగళవారం ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..గత సంవత్సరం నుండి దీపక్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడని, సోమవారం రాత్రి సైతం మద్యం సేవించి తన భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయి జీవితంపై విరక్తి చెంది యానం వీధిలో టేకు చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


Similar News