సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలి...
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల స్థానిక ఎస్సై విక్రం తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.
దిశ, మోర్తాడ్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల స్థానిక ఎస్సై విక్రం తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఈజీ మనీ సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ బెట్టింగులలో భాగంగా ఆన్లైన్ యాప్ లాంటివి ఆడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్నవారే ఎక్కువగా సైబర్ నేరాల పట్ల మోసపోతున్నారని, కావున నేరాలు పెరుగుతున్న క్రమంలో విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.