మీడియా రంగానికి దిశ ఒక దిక్సూచి
నేటి డిజిటల్ సమాజంలో మీడియా రంగానికి దిశ పత్రిక ఒక దిక్సూచిగా మారిందని తహసీల్దార్ గంగాధర్ కొనియాడారు.
దిశ, కోటగిరి : నేటి డిజిటల్ సమాజంలో మీడియా రంగానికి దిశ పత్రిక ఒక దిక్సూచిగా మారిందని తహసీల్దార్ గంగాధర్ కొనియాడారు. కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ తన సిబ్బందితో కలిసి దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..డిజిటల్ యుగంలో దిశ దిన పత్రిక అతీతకాలంలోనే మంచి పేరును సంపాదించుకుందని, ప్రజా సమస్యలపై గళం విప్పుతూ మంచి ఆదరణ పొందిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ ప్రతినిధి కాసుల శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.