కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలుచేయాలి
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీజెపి నాయకులు నిరసన తెలియజేశారు.
దిశ,తాడ్వాయి : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీజెపి నాయకులు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దత్తాత్రేయ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాంతం రిజర్వేషన్లు అమలుపర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు ఉద్యమాలు సైతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షులు యాదగిరి, బిజెపి రాష్ట్ర నాయకుడు మరి బాపురెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, అంకాలపు శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, కిసాన్ మోర్చా అధ్యక్షుడురవీందర్, ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి అరవింద్,ఓబీసీ ఉపాధ్యక్షులు రమేష్,రమేష్, శ్రవణ్,బూత్ అధ్యక్షులు రాజు,నవీన్,శ్రీను,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.