క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ సేకరణ

వివిధ కేసుల్లో, సమస్యలపై బాధితులు పోలీసులకు చేస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందిస్తున్న తీరుపై ఫీడ్ బ్యాక్ సేకరించాలని ఇంచార్జీ సీపీ సింధూ శర్మ వెల్లడించారు.

Update: 2025-01-08 11:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 08: వివిధ కేసుల్లో, సమస్యలపై బాధితులు పోలీసులకు చేస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందిస్తున్న తీరుపై ఫీడ్ బ్యాక్ సేకరించాలని ఇంచార్జీ సీపీ సింధూ శర్మ వెల్లడించారు. ప్రజల సౌలభ్యం కోసం క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించనున్నట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దారులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు , పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరోననే విషయాలను సేకరించేందుకే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు సీపీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ పద్దతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9 న రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీని వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించి తెలుసుకోవచ్చన్నారు. ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు జనాలతో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున పౌరులు ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సింధూ శర్మ సూచించారు.


Similar News