తులం బంగారం..నేను వాడుకుంటున్నానని మాత్రం అనుకోవద్దు
చెక్కుల రూపంలో వచ్చిన డబ్బులను మాత్రమే ఇస్తున్నానని, తులం బంగారం నేను వాడుకుంటున్నానని మాత్రం, అపోహలు పెట్టుకోవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు
దిశ, భిక్కనూరు : చెక్కుల రూపంలో వచ్చిన డబ్బులను మాత్రమే ఇస్తున్నానని, తులం బంగారం నేను వాడుకుంటున్నానని మాత్రం, అపోహలు పెట్టుకోవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భిక్కనూరు రైతు వేదికలో 23 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద, డబ్బులతో పాటు, తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ, ఇంకా బంగారం మాత్రం ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయం మీకు తెలియక, ప్రభుత్వం ఇచ్చే బంగారం నేను వాడుకుంటున్నానని అనుకోకుండా ఉండేందుకే ఈ విషయమై పూర్తి క్లారిటీ ఇస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు, దోమకొండ ఎంపీడీఓలు రాజ్ కిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బిజెపి భిక్కనూరు మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్, దోమకొండ మండల శాఖ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రవి, బీబీపేట మండల శాఖ అధ్యక్షులు రంజిత్, బిజెపి నాయకులు తక్కళ్ల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.