పురుషుల కన్నా మహిళలే ఆధిక్యం..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో మహిళలదే పైచేయిగా ఉంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో మహిళలదే పైచేయిగా ఉంది. పురుషుల ఓటర్ల సంఖ్య కన్నా మహిళా ఓటర్లు 80,875 మంది అధికంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 14,35,214 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,77,130 మంది కాగా, 7,58,005 మంది మహిళలు ఉన్నారు. 79 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే..
ఆర్మూర్ నియోజకవర్గంలో 219 పోలింగ్ స్టేషన్ లు, 2,14,136 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 1,14,473 మంది, పురుషులు 99,657 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఆరుగురున్నారు. సర్వీసు ఓటర్లు 130 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 126 మంది, ట్రాన్స్ జెండర్లు నలుగురున్నారు.
బోధన్ నియోజకవర్గంలో 246 పోలింగ్ స్టేషన్ లు, 2,24,772 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,06,999 మంది, మహిళలు 1,17,768 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఐదుగురున్నారు. సర్వీసు ఓటర్లు 169 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 164 మంది, ట్రాన్స్ జెండర్లు ఐదుగురున్నారు.
బాన్సువాడ లో 259 పోలింగ్ స్టేషన్లున్నాయి. 1,98,738 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 94,577 మంది కాగా, మహిళలు 1,04,145 మంది ఉన్నారు. 16 మంది ట్రాన్స్ జెండర్లున్నారు. సర్వీసు ఓటర్లు 201 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 195 మంది, మహిళలు ఆరుగురున్నారు.
నిజామాబాద్ అర్బన్ లో 301 పోలింగ్ స్టేషన్లున్నాయి. 3,07,459 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,48,162 కాగా, మహిళలు 1,59,255 మంది ఉన్నారు. 42 మంది ట్రాన్స్ జెండర్లున్నారు. సర్వీసు ఓటర్లు 65 మంది కాగా, వీరిలో పురుషులు 62 మంది, మహిళలు ముగ్గురున్నారు.
నిజామాబాద్ రూరల్ లో 293 పోలింగ్ స్టేషన్లున్నాయి. 2,60,485 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,21,627 మంది కాగా, మహిళలు 1,38,852 మంది ఉన్నారు. ఆరుగురు ట్రాన్స్ జెండర్లున్నారు. సర్వీసు ఓటర్లు 191 మంది కాగా, వీరిలో పురుషులు 186 మంది, మహిళలు ఐదుగురున్నారు.
బాల్కొండ లో 247 పోలింగ్ స్టేషన్లున్నాయి. 2,29,624 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,06,108 మంది కాగా, మహిళలు 1,23,512 మంది ఉన్నారు. నలుగురు ట్రాన్స్ జెండర్లున్నారు. సర్వీస్ ఓటర్లు 72 మంది కాగా, వీరిలో పురుషులు 71 మంది ఉండగా, ఒక్కరే మహిళ ఉన్నారు.