నిజామాబాద్ టు హైదరాబాద్.. ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం..
నిజామాబాద్ డిపో నుంచి వయా వర్ని, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిజామాబాద్ డిపో అధికారులు ప్రారంభించారు.
దిశ, నాగిరెడ్డిపేట్ : నిజామాబాద్ డిపో నుంచి వయా వర్ని, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిజామాబాద్ డిపో అధికారులు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతనమైన ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాన్సువాడ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిపో నుండి ఎలక్ట్రిక్ బస్సులు మోస్రా, వర్ని, బాన్సువాడ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు మూడు బస్సులు నడుపుతున్నట్లు, మాజీ సైనిక ఉద్యోగి, గోపాల్ పేట్ ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ మోహన్ రావు తెలిపారు. ఈ ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని మోహన్ రావు తెలిపారు. అధునాతనమైన ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోపాల్ పేట్ మీదుగా హైదరాబాద్ వరకు నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపడం ప్రారంభించడంతో మండల ప్రజలు ప్రయాణికులు బాన్సువాడ డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.