రైతు అభివృద్ధి కొరకే రేవంత్ సర్కారు.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ సర్కార్ రైతు అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని, దీనిలో భాగంగా సంక్రాంతి నుండి ఎకరాకు 12, రైతు భరోసాతో పాటు రుణమాఫీ కానీ రైతులకు త్వరలో రైతు రుణమాఫీ చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు.
దిశ, నవీపేట్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ సర్కార్ రైతు అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని, దీనిలో భాగంగా సంక్రాంతి నుండి ఎకరాకు 12, రైతు భరోసాతో పాటు రుణమాఫీ కానీ రైతులకు త్వరలో రైతు రుణమాఫీ చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. హీరోలా సొసైటీ ఆధ్వర్యంలో లింగాపూర్ నాలేశ్వర్ గ్రామాలలో నిర్మించిన గిడ్డంగులను ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కొరకు బినోల సొసైటీ ఆధ్వర్యంలో గోదాములు, విశ్రాంతి గదులు నిర్మించడం పై, చైర్మన్ హన్మాండ్లు, పాలక వర్గాన్ని అభినందించారు. రేవంత్ రెడ్డి సర్కారు రైతుల అభివృద్ధి కొరకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా అందిస్తుందని అన్నారు.
ఆధార్ కార్డ్, పట్టాబుక్ లలో చిన్న చిన్న తప్పులతో రుణమాఫీ కానీ రైతుల సమస్యలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలేశ్వర్ గ్రామస్తుల వినతి మేరకు రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని, ప్రభుత్వ స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు. నాలేశ్వర్ లో పశు వైద్యుడిని నియమిస్తానని, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహశీల్దార్ వెంకట రమణ, ఎంపీడీఓ నాగనాథ్, పాలకవర్గ సభ్యులు, సొసైటీ సీఈఓ రమేష్, కాంగ్రెస్ మండల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.